bitter-guard-juice-benefits-for-diabetics
Diabetics: ఈ జ్యూస్ తాగిన 30 నిమిషాల్లో.. చక్కెర స్థాయిలు తగ్గుతాయ్..!
Diabetics: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య.. డయాబెటిస్. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ (IDF) అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా.. అర బిలియన్ కంటే ఎక్కువ మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2030 నాటికి, 640 మిలియన్ల కంటే ఎక్కువ మంది డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారని అంచనా వేస్తోంది. 2019,లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 మిలియన్ల మంది డయాబెటిస్ కారణంగా మరణించారు. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. కిడ్నీ, కళ్లు,గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పబ్మెడ్ సెంట్రల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, కాకారకాయ జ్యూస్ తాగడం వల్ల కేవలం 30 నిమిషాల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో, జ్యూస్ తాగిన గంటన్నర తర్వాత.. రక్తంలోని చెక్కర స్థాయిలు మరింత తగ్గి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని స్పష్టం చేసింది.
అదే జర్నల్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం.. కాకరకాయలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. దీనిలోని ట్రైటెర్పెన్, ప్రొటైడ్, స్టెరాయిడ్, ఆల్కలాయిడ్, అకర్బన, లిపిడ్ , ఫినోలిక్ సమ్మేళనాల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి డయాబెటిస్ మెల్లిటస్‌ను మూలం నుంచి నిర్మూలించడంలో సహాయపడతాయి.
న్యాచురల్ ఇన్సులిన్..
కాకరకాయలో ఇన్సులిన్‌లా పని చేసే పోషకాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి గ్లూకోజ్‌ను ఉపయోగించుకోవడానికి.. కణాలకు సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
ఈ పోషకాలు ఉంటాయి..
FDA ప్రకారం, ఒక కప్పు (94 గ్రా) కాకరకాయలో ఫైబర్: 2 గ్రా, విటమిన్ సి: 93%, విటమిన్ ఎ 44%, ఫోలేట్ 17%, పొటాషియం 8%, జింక్ 5% , ఐరన్ 4% ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..
కాకరకాయ ప్రయోజనాలు పొందాలంటే రోజూ ఉదయాన్నే ఒక కప్పు జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రకరకాలుగా వండుకుని, సూప్‌గా చేసుకుని మీ డైట్‌లో తీసుకోండి.
గమనిక:

ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.