Kendriya-Vidyalaya-Sanghatan-KVS-admissions-2023-24-notification
దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ మేరకు మార్చి 21న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకటోతరగతిలో ప్రవేశాలకు విద్యార్థులకు 31.03.2023 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.
తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.
ముఖ్యమైన తేదీలు...
షెడ్యూలు వెల్లడి: 21.03.2023
నోటిఫికేషన్ వెల్లడి: 25.03.2023.
* క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27.03.2023. (ఉ.10.00 గం. నుంచి)
➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 17.04.2023. (సా. 7.00 గం. వరకు)
➥ ఎంపిక జాబితా వెల్లడి: 20.03.2023 (లిస్ట్-1), 28.03.2023 (లిస్ట్-2), 04.05.2023 (లిస్ట్-3).
➥ సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ):
నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 03.05.2023.
➥ రిజిస్ట్రేషన్: 04.05.2023 - 11.05.2023.
➥ ఎంపికజాబితా వెల్లడి: 18.05.2023 - 25.05.2023.
* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 03.04.2023 - 12.04.2023.
➥ ఎంపిక జాబితా వెల్లడి: 17.04.2023.
➥ ప్రవేశాలు: 18.04.2023 - 29.04.2023.
➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 30.06.2023.
➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.
➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.
➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.
➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.