appsc-group-4-jobs-mains-merit-list-2023

 appsc-group-4-jobs-mains-merit-list-2023

It is hereby informed that the marks list of all candidates to the post of Junior Assistant cum Computer Assistant in A.P Revenue Department under Group-IV services vide Notification No.23/2021 is hosted on Commission’s website https://psc.ap.gov.in/. Further process of recruitment will be completed by concerned District Collectors.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో వెల్లడించింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు షిఫ్టుల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT) విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. మొత్తం 670 పోస్టులకు గాను స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించగా 2,11,341 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 11,574 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్‌లో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫైనల్‌ కీ ని సైతం ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 డౌన్లోడ్ PDF
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల చేసింది. APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌, పేరు, అభ్యర్ధి సాధించిన మార్కులను ప్రకటిస్తుంది. APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా 2023 2023 అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేసింది. 

APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా జిల్లాల వారీగా మేము ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 మెయిన్స్  మెరిట్ జాబితా 2023ను డౌన్లోడ్ చేసుకోగలరు..

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 PDF.