India Post GDS Special Cycle Recruitment 2023
పోస్ట్ ఆఫీస్ ల్లో 12,828 పోస్టులు, రాత పరీక్ష లేదు.. మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక
India Post GDS ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: మే 22, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11, 2023
- దరఖాస్తు సవరణలకు అవకాశం: జూన్ 12 నుంచి 14 వరకు ఉంటుంది.
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి సంబంధించి స్పెషల్ సైకిల్ మే-2023 ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం ), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీ ఎం) హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 12,828 ఖాళీలు వున్నాయి.
అర్హత:*
▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔
_పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. జీతం నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది._
సెలెక్షన్:*
▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మా ర్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు._
దరఖాస్తులు:
▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔▔
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
- అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
- వయసు: 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
- జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
- ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.