PMJJBY-PMSBY-insurance-payment-May-2023

PMJJBY-PMSBY-insurance-payment-May-2023

Bank Account: మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.456 కట్ చేయనున్న బ్యాంకులు... ఎందుకో తెలుసుకోండి

Bank Account | త్వరలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంకులు రూ.456 కట్ చేయబోతున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

మీ బ్యాంక్ అకౌంట్‌లో (Bank Account) బ్యాలెన్స్ ఎంత ఉంది? మీ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి బ్యాంకులు రూ.436 కట్ చేయబోతున్నాయి. అందుకే మీ అకౌంట్‌లో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. బ్యాంకులు అకౌంట్‌ను డబ్బులు కట్ చేయడానికి కారణమేంటో తెలుసా? మీరు గతంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) పథకంలో చేరడమే
ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో ఉన్నవారు ప్రతీ ఏటా రూ.436 ప్రీమియం చెల్లించాలి. వారికి రూ.2 లక్షల జీవిత బీమా లభిస్తుంది. ఒక్కసారి ఈ పథకంలో ఎన్‌రోల్ చేసుకున్నట్టైతే ప్రతీ ఏటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లిస్తేనే జీవిత బీమా పాలసీ యాక్టీవ్‌గా ఉంటుంది.
గతంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం రూ.330 ఉండేది. గతేడాది ప్రీమియం రూ.106 పెంచడంతో ప్రస్తుతం రూ.436 చెల్లించాలి. 
ఇదొక్కటే కాదు... ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పేరుతో మరో బీమా పథకం కూడా ఉంది. ఈ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రూ.20. గతంలో రూ.12 ఉండేది
కానీ గతేడాది ప్రీమియం రూ.8 పెంచి మొత్తం రూ.20 చేసింది. ఈ స్కీమ్‌లో ఉన్నవారైతే రూ.20 ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ రెండు పథకాల్లో ఉన్నవారైతే మొత్తం కలిపి రూ.456 ప్రీమియం చెల్లించాలి. మే 31 తేదీలోగా బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి. కాబట్టి ఈ రెండు పథకాల్లో ఉన్నవారు ఈ ప్రీమియం అమౌంట్‌కి సరిపోయేలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పాలసీలు ప్రతీ ఏటా జూన్ 1 నుంచి అమలులో ఉంటాయి. పాత పాలసీ ముగియగానే కొత్త పాలసీ రెన్యువల్ అవుతుంది. అయితే ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే పాలసీ రెన్యువల్ అవుతుంది
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన జీవిత బీమా పాలసీ. వార్షిక ప్రీమియం రూ.436 చెల్లిస్తే రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకం కింద 50 ఏళ్ల వరకే బీమా వర్తిస్తుంది. ఆ తర్వాత పాలసీ ల్యాప్స్ అవుతుంది
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన: ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ లాంటింది. 
కేవలం రూ.20 ప్రీమియం చెల్లిస్తే రూ.2,00,000 ప్రమాద బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ.2,00,000 బీమా డబ్బులు లభిస్తాయి. పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1,00,000 లభిస్తుంది. ఇది కేవలం యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ పాలసీ మాత్రమే. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు