RGUKT IIIT Admission 2023 Notification
RGUKT IIIT Admission 2023 Notification. Released.
15% seats are available for AP &TS as open Category. So AP students can also get admission at RGUKT Basar. Intrested may avail the Opportunity.
ట్రిపులఐటీల్లో ప్రవేశాలకు *ప్రకటన 3న
ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోనిట్రిపులఐటీల్లో ప్రవేశాలకు జూన్ 3న ప్రకటన విడుదల. 2023-24 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు విద్యార్థులు 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.
RGUKT-AP ADMISSIONS for 2023-24 ACADEMIC YEAR Important Dates
ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు అర్హత, ఎంపిక విధానం.
ఏపి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ప్రకటన 2023 జూన్ 3న విడుదల చేయనున్నారు. విద్యార్థులు 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.
*గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.
*అర్హత:
10వ తరగతి ఉత్తీర్ణత. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ప్రవేశానికి అర్హులు.
*ఎంపిక ప్రక్రియ విధానం:
10 వ తరగతి మార్కుల ఆధారంగా. మార్కులు సమానంగా వస్తే క్రింది విధానం అమలు చేయబడుతుంది.
i. గణితంలో ఎక్కువ మార్కులు
ii. జనరల్ సైన్స్‌లో ఎక్కువ మార్కులు
iii. ఇంగ్లీషులో ఎక్కువ మార్కులు
iv. సోషల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు
v. ఫస్ట్ లాంగ్వేజ్ లో ఎక్కువ మార్కులు
vi. పుట్టిన తేదీ ప్రకారం పెద్ద అభ్యర్థి
vii. హాల్ టికెట్ నంబర్ నుండి పొందిన అత్యల్ప సంఖ్య.
దరఖాస్తు రుసుము: రూ. 250. SC/ST లకు రూ. 150.