ap-academic-calender-2023-24-for-primary-High-schools
అకడమిక్ క్యాలెండర్ 2023–24 ను విడుదల చేసిన సీఎం.*
జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్న నేపథ్యంలో.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. మొత్తం 88 సెలవులు వచ్చాయి.
ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది.
ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. శనివారం రెండో శనివారం అయితే శుక్రవారమే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని క్యాలెడర్‌లో పేర్కొన్నారు.
విద్యాసంవత్సరం సెలవులు ఇవే..
➥ దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు ఇస్తారు.
➥ నవంబరు 12న దీపావళ
➥ డిసెంబరు 25న క్రిస్మస్
➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు
➥ క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.
పరీక్షల తేదీలు ఇలా..
➥ ఫార్మాటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9 తరగతులకు ఆగస్టు 1-4, ఫార్మాటివ్-2 అక్టోబరు 3 - 6 వరకు నిర్వహిస్తారు.
➥ సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు నవంబరు 4 - 10 వరకు, ఫార్మాటివ్-3 (సీబీఏ) జనవరి 3 - 6 మధ్య, ఫార్మాటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 23-27 వరకు నిర్వహిస్తారు.
➥ పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మేటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు నిర్వహిస్తారు.
ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు.