AP EAPCET Result-date-June-14th

 AP EAPCET Result-date-June-14th

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారైంది. ఫలితాలను జూన్ 14న ఫలితాలు విడుదల. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.

ఏపీ ఈఏపీసెట్-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారైంది. ఫలితాలను జూన్ 14న ఫలితాలు విడుదల. ఈ ఫలితాలను జూన్ 14న ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు.

ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ పరీక్షలకు సంబంధించి.. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను మే 24న విడుదల చేశారు. అదేవిధంగా మే 24 నుంచి 26 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు.  

25 మార్కులు వెయిటేజీ..
రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.  2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించారు.  

మీకు వచ్చిన ర్యాoకును బట్టి ఏ కాలేజీ లో సీటు వస్తుoదో తెలుసుకోoడి. CLICK HERE

AP EAPCET COLLEGE PRIDICTOR CLICK HERE

AP EAPCET-2023 OFFICIAL WEBSITE LINK