AP EDCET - 2023-HALLTICKETS-LINK
జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
ఏపీలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్-2023' పరీక్షను మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20న జరపాల్సిన ఉండగా.. జూన్ 14న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది తిరుపతి-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యతను చేపట్టింది.
APEDCET 2023 HALLTICKETS DOWNLOAD LINK
జూన్ 19న ఆన్సర్ కీ..
ఏపీఎడ్‌సెట్ 2023 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్ 19న విడుదల చేయనున్నారు. అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 21న సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా నమోదుచేసిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించరు. అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో మాత్రమే నమోదుచేయాలి. మరే ఇతర విధానాల్లో నమోదచేసే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోరు.
పరీక్ష విధానం..
➥ మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
➥ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు, పార్ట్-బి: జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-సిలో మెథడాలజీ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. మెథడాలజీలో అభ్యర్థులు ఎంపికచేసుకునే సబ్జె్క్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
➥ మెథడాలజీలోలో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ (జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్), ఇంగ్లిష్ సబ్జె్క్టులు ఉంటాయి.
AP EDCET 2023 OFFICIAL WEBSITE
ENGLISH QUESTION PAPER CLICK HERE
MATHS QUESTION PAPER CLICK HERE
PHYSICAL SCIENCE QUESTION PAPER CLICK HERE
BIOLOGICAL SCIENCE QUESTION PAPER CLICK HERE
SOCIAL QUESTION PAPER CLICK HERE