ap-pgecet-2023-results-released--rank-cards-download
AP PGECET Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పీజీఈసెట్-2023' ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీ పీజీఈసెట్-2023' ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 28 నుంచి 30 వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.