Ekalavya-mode-schools-applications-for-teaching-non-teaching-posts
EMRS Recruitment: 4062 ఏకలవ్య ఉద్యోగాలు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్, PGT, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) అండ్ ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4062 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా EMRSలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE) -2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే ఈ పరీక్షను ఆన్ లైన్ విధానంలో ఉండనుంది.
EMRS ఖాళీల వివరాల్లోకి వెళ్తే.. ప్రిన్సిపాల్-303 పోస్టులు ఖాళీగా ఉండగా..అభ్యర్థుల యొక్క వయస్సు 50 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు 2,266 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
నాన్ టీచింగ్ ఉద్యగాల్లో అకౌంటెంట్ విభాగంలో 361 పోస్టులు ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల 759 ఉండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఇక ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు 373 పోస్టులుండగా.. అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాలలోపు ఉండాలి.
మొత్తం ఖాళీలు: 4062
పోస్టుల వారీగా ఖాళీలు..
1) ప్రిన్సిపల్: 303 పోస్టులు
అర్హత: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2266 పోస్టులు
అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.
వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.
3) అకౌంటెంట్: 361 పోస్టులు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.
4) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JNA): 759
అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.19900-రూ.63200
5) ల్యాబ్ అటెండెంట్: 373
అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు.. ప్రిన్సిపాల్ - రూ. 78,800-రూ.2,09,200, పీజీటీ - రూ. 47600-151100, అకౌంటెంట్ - రూ. 35400-112400, JSA - రూ. 19900-63200, ల్యాబ్ అటెండెంట్ రూ. 18000-56900గా ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అర్హతలు.. ప్రిన్సిపాల్ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ B.Ed.12 సంవత్సరాల అనుభవం ఉండాలి. PGT ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల్లో అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ (క్లాస్ XII) సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషాలకు 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికేట్/డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్‌తో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇక దరఖాస్తులకు జులై 31న చివరి తేదీగా పేర్కొన్నారు. పూర్తి వివరాలక ు https://emrs.tribal.gov.in/backend/web/ సందర్శించండి.
దరఖాస్తు ఇలా..
-అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.