ap-eapcet-2023-counselling-web-options-started-Link
Engineering Colleges: ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, 73 కాలేజీలకు 'నో' పర్మిషన్
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 7న ప్రారంభమైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉదయం 12 గంటలకే ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్ ఆప్షన్ల నమోదుకోసం లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 13న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక వీరికి ఆగస్టు 17న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది
వెబ్‌ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి..
వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూలు ఇలా..
➥ ఆప్షన్ల నమోదు: 07.08.2023 నుంచి 12.08.2023 వరకు.
➥ ఆప్షన్లలో మార్పులు: 13.08.2023.
➥ సీట్ల కేటాయింపు: 17.08.2023.
➥ సెల్ఫ్ రిపోర్టింగ్(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్: 18.08.2023 నుంచి 21.08.2023 వరకు.
➥ ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం: 23.08.2023 నుంచి.
AP EAPCET - 2023 OFFICIAL WEBSITE LINK
73 కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు నిలిపివేత..
ఏపీ ప్రభుత్వం 73 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేసింది. కౌన్సెలింగ్ జాబితా నుంచి కూడా ఆ కళాశాలలను తొలగించింది. ఏఐసీటీఈ 252 కళాశాలలకు అనుమతులిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం 179 కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించింది. దీనికి విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు, ఇతరత్ర సేవల కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను సదరు కళాశాలలు చెల్లించలేదని కారణంగా పేర్కొంది.
92 కళాశాలలకు రూ.43 వేలే ఫీజులు..
ఏపీలోని ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి కనీస ఫీజు రూ.43 వేలు, గరిష్ఠం రూ.77 వేలుగా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 220 ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు నిర్ణయించగా 92 కళాశాలల్లో కనిష్ఠ ఫీజు రూ.43 వేలుగా ఉంది. గత నాలుగేళ్లుగా కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా హైకోర్టు ఆదేశాలతో రూ.8 వేలు పెరిగింది.