chandrayan-3-vikram-lander-work-on-moon-details

 chandrayan-3-vikram-lander-work-on-moon-details

Chandrayaan-3: చందమామపై దిగిన రోవర్.. వీడియో రిలీజ్ చేసిన ఇస్రో

Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక దేనికోసం పరిశోధన చేస్తుంది?

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ వీడియోని ఇస్రో తాజాగా రిలీజ్ చేసింది.

చంద్రుని దక్షిణ ధ్రువం పై అనుకున్నట్టే ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల సమయం లో విక్రమ్ లాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. మన ప్రయోగం విజయవంతం అయ్యింది . ప్రపంచ దేశాల్లో భరత్ మొత్త్తమొదటి దేశము గా నిలిచిందిచంద్రయాన్‌-3 లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి..
  • 1) ప్రొపల్షన్‌ మాడ్యూల్‌,
  • 2) ల్యాండర్‌,
  • 3) రోవర్‌

ఈ మూడూ సమన్వయంతో పనిచేస్తేనే ఇస్రో కంటున్న చదనరుని దక్షిణ ధ్రువం కలలు నెరవేరతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను మోహరించారు.

రోవర్ ఎలా ప‌నిచేస్తుంటే..?

ఇది దీర్ఘచతురస్రాకార ఆకృతిలో.. ల్యాండర్‌లోని ఒక ఛాంబర్‌లో ఉంటుంది. ర్యాంప్‌ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడం కోసం దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్‌ కెమెరాను అమర్చారు. సైన్స్‌ పరిశోధనల కోసం ఇందులో ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కొపీ అనే పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ల్యాండింగ్‌ ప్రాంతంలో మూలకాల గురించి శోధిస్తాయి. ఆర్‌ఎక్స్‌/టీఎక్స్‌ యాంటెన్నాల ద్వారా నేరుగా ల్యాండర్‌తో రోవర్‌ కమ్యూనికేషన్‌ సాగించగలదు.

https://youtu.be/lYYY17pE6yE

ఇవి ఎంతకాలం పనిచేస్తాయంటే..?

MOON ఉపరితలంపై విజయవంతంగా దిగాక LANDER, ROVER.. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎంతకాలం పనిచేస్తాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే! Moonపై ఒక రోజు length భూమిమీద సుమారు 28 రోజులు. అందులో Day Time 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత Night సమయం మొదలవుతుంది. అది చాలా cool గా, ప్రతికూలంగా ఉంటుంది. Sunlight లభించదు. ఆ వాతావరణాన్ని చంద్రయాన్‌-3 పరికరాలు తట్టుకొని నిలబడటం అనుమానమే! అందువల్ల 14 Days మాత్రమే పనిచేసేలా ల్యాండర్‌, రోవర్‌లను రూపొందించారు. అయితే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ సూర్యోదయమయ్యాక అవి ‘inactive’ నుంచి మేల్కొని, తిరిగి పనిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్.. మెల్లగా చందమామపై దిగింది. ఆ తర్వాత దాని సోలర్ ప్యానెల్స్ ద్వారా సోలార్ పవర్ పొందుతూ.. అది పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ప్రజ్ఞాన్ రోవర్.. చందమామపై 14 రోజులు పనిచేస్తుంది. ఆగస్టు 23 నుంచి ఇది పని ప్రారంభించింది. ఇది చందమామ ఉపరితలంపై ఉన్న నీటి రహస్యాల గుట్టు విప్పతుందని భావిస్తున్నారు.

చంద్రయాన్ 3 రోవర్ లాండర్ నుండి చంద్ర ఉపరితలంపైకి ఎలా దూసుకుపోయిందో వీడియో విడుదల చేసిన ఇస్రో