Google Winter Internship 2024-details

 Google Winter Internship 2024-details

Google Internship : నెలకు రూ. 83,000తో గూగుల్ ఇంటర్న్‪షిప్‌.. హైదరాబాద్‌, బెంగళూరులో వర్క్‌ చేయాలి
  • గూగుల్‌ వింటర్‌ ఇంటర్న్‌షిప్‌ 2024
  • ఫైనలియర్‌ చదవుతున్న వాళ్లు అర్హులు
  • అక్టోబర్‌ 1 దరఖాస్తులకు చివరితేది
  • Google Winter Internship 2024 : ఫైనలియర్‌ చదువుతున్న గ్రాడ్యుయేట్లకు గూగుల్‌ (Google) గుడ్‌న్యూస్‌ చెప్పింది. 'వింటర్ ఇంటర్న్‌షిప్‌-2024' పేరిట ప్రత్యేక ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. గూగుల్ సంస్థ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లయ్‌ చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో కెరీర్‌ని ప్రారంభించాలనుకునే ఫ్రెషర్‌లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం. ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లయ్‌ చేసుకోవడానికి అక్టోబర్‌ 1, 2023 చివరితేది. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌, బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
    అర్హతలివే:
    ఇంటర్న్‌షిప్‌ కోసం అప్లయ్‌ చేసుకోవాలంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python) ఉండాలి.
    ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్‌ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌, నెట్‌వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే పని.

    ఇంటర్న్‌షిప్‌లకు మంచి డిమాండ్ :
    ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్‌లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. విద్యార్థులకు ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే ముందే పని అనుభవం ఈ ఇంటర్న్‌షిప్‌ ద్వారా అందుతుంది. తద్వారా ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే కంపెనీ పని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా కంపెనీలకు మేలు జరుగుతోంది. ప్రస్తుతం అనేక సంస్థలు ఈ ఇంటర్న్‌షిప్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇవి చేయడం ద్వారా సంబంధిత ఫీల్డ్ లో వర్క్ చేసే విధానంపై అవగాహన ఏర్పడుతుంది. అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. ఇదే క్రమంలో గూగుల్ వింటర్ ఇంటర్న్‌షిప్‌-2024 ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
    స్టైపెండ్‌ ఎంతంటే..?
    ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వాళ్లు ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది
    ఇలా అప్లయ్‌ చేసుకోవాలి:
    • మొదట రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి.
    • GOOGLE Internships CLICK HERE
    • Engineering & Technical Internships CLICK HERE
    • CLICK HERE ఈ లింకుపై క్లిక్‌ చేసి.. రెజ్యూమ్ సెక్షన్‌లో రెజ్యూమ్ అప్‌లోడ్‌ చేయాలి.
    • హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి.
    • ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి.
    • తరువాత ఇంగ్లీష్ ట్రాన్‌స్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్‌ చేయాలి.