how-to-become-isro-scientist-details

 how-to-become-isro-scientist-details

ISRO : ఇస్రో శాస్త్రవేత్త కావాలనుందా..? అయితే.. ఏం చదవాలి.. ఎలా ఎంపిక చేస్తారు.. జీతాలు ఎంత ఉంటాయో తెలుసా..?

ISRO సైంటిస్ట్ ఇంజినీర్ సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి..
ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షలో నిర్దిష్ట సాంకేతిక క్రమశిక్షణ నుండి 80 ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు మరియు పరీక్షలో సమానమైన మార్కులను తెలియజేసే జనరల్ ఆప్టిట్యూడ్ నుండి 15 ప్రశ్నలు ఉంటాయి.
ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష యొక్క మొత్తం సమయం 120 నిమిషాలు ఉంటుంది.
ISRO సైంటిస్ట్ ఇంజనీర్ పరీక్ష 2023లో 1/3 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
ISRO : చంద్రయాన్ -3తో భారతదేశం స్థాయి మారిపోయింది. ఇంతవరకూ ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపి ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది. ఈ ఎపిసోడ్‌ చాలా మంది విద్యార్థుల్లో ఇస్రో, అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని రేకెత్తించింది. దీంతో.. చాలా మంది విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలు కావాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇస్రోలో శాస్త్రవేత్త కావాలంటే.. ఏం చదవాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..? అనే అంశాలను తెలుసుకుందాం..
  • ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలంటే..?
శాస్త్రవేత్త కావడానికి ప్రత్యేకమైన కోర్సు అంటూ ఏమీ లేదు. బీటెక్, ఎంటెక్ వంటి అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన వారే అక్కడ పని చేస్తారు. ఏదైనా ప్రాజెక్టుకి వాళ్లను కేటాయించినప్పుడు ఇస్రో వారికి శిక్షణ ఇస్తుంది. కాబట్టి.. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం పెంపొందించుకోవాలి. మ్యాథ్స్‌లో బలంగా ఉండాలి. అలాగే.. శాస్త్రవేత్త కావాలని కలలు కనే విద్యార్థులు.. ఉన్నత చదువులకు వెళ్లే సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు లేదా ఇంజినీరింగ్ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది
డిగ్రీలో సైన్స్, లేదా ఇంజినీరింగ్‌ తప్పనిసరి. ఈ రెండింటిలో తమ ఆసక్తిని బట్టి ఒక దానిని ఎంచుకోవచ్చు. జేఈఈ పరీక్ష రాసి ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు. అలాగే.. తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐ‌ఎస్‌టీ)లో చేరొచ్చు. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అలాగే.. ఇస్రోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా అంతరిక్ష పరిశోధనలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ వంటి సంస్థల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష అన్వేషణలో శాస్త్రవేత్తలుగా పని చేస్తున్నారు.
ఇస్రోలో ఎంపిక ఎలా ఉంటుందంటే..?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)ని ఎంపిక చేసుకోవడం మేలు. అందుకు జేఈఈలో మంచి మార్కులు సంపాదించాలి. అలాగే.. కోర్సులకు ఎంపిక కూడా జేఈఈలో మార్కులను బట్టే ఉంటుంది. అలాగే.. సైంటిస్ట్‌గా ఉద్యోగం పొందాలంటే స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఇస్రో శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగుల జీతాలు ఇలా :
టైమ్స్ నౌ న్యూస్ ప్రకారం.. ఇస్రోలోని ఇంజనీర్లు రూ. 37,400 నుంచి రూ. 67,000 వరకు మరియు సీనియర్ సైంటిస్టులు రూ.75,000 నుంచి రూ.80,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలకు నెలకు రూ.2 లక్షల జీతం లభించే అవకాశం ఉంది. ఈ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.