SBI Recruitment: ఎస్‌బీఐలో 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు, పరీక్ష ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 439 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సరైన అర్హతలున్నవారు అక్టోబరు 6లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్: 439 పోస్టుల ు
➥ అసిస్టెంట్ మేనేజర్
➥ డిప్యూటీ మేనేజర్
➥ చీఫ్ మేనేజర్
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్:
➥ ప్రాజెక్ట్ మేనేజర్
➥ మేనేజర్
➥ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం..
➥ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిచే పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. వీటి నుంచి మొత్తం 270 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 195 ప్రశ్నలు అడుగుతారు.
➥ మొదటి విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 120 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. వీటిలో రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు 35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
➥ రెండో విభాగంలో ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించి జనరల్ ఐటీ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 50 మార్కులు, రోల్ బేస్డ్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 70 నిమిషాలు.
➥ రాతపరీక్షకు 70 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 30 శాతం మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.09.2023
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.10.2023.
* ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023/ జనవరి 2024.