from-desk-of-principal-secretary-episode-12-youtube-link
జిల్లా విద్య శాఖ అధికారులకు అందరికీ నమస్కారం.
ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు, 12వ ఎపిసోడ్ ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా, సందేశాన్ని వీక్షించవలసిందిగా కోరుచున్నాము.
ఈ యూట్యూబ్ లింక్ ని మీ జిల్లా పరిధిలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.
శ్రీయుత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి యూట్యూబ్ ఫ్రo ది బెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ 12వ ఎపిసోడ్ ముఖ్యాంశాలు...*
ఇంతకు మునుపు ఎస్ఏ వన్ పరీక్షలు ఏ టీచరు కా టీచర్ పెట్టుకున్న పేపర్ తోటి జరిగేవి*.
అయితే వాటిని పూర్తిగా రాష్ట్రం మొత్తం ఒకటే పేపర్ ఉండేలాగా చర్య తీసుకుని క్వాలిటీని పెంచటం జరిగింది.*
వారు వెళ్లిన ప్రతి పాఠశాలలోనూ 10వ తరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్న విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది.*
అలాగే డిసెంబర్ 11వ తేదీన ఎస్ఏ వన్ పరీక్షల పేపర్లు ఇచ్చి విద్యార్థులతో సెల్ఫీ విత్ ద టాపర్ కార్యక్రమంలో భాగంగా వారి ఫోన్ నెంబర్ కు పిల్లలతో దిగిన ఫోటోలను పంపవలసిందిగా సూచించారు*.
ఇక 21 డిసెంబర్ న చాలా ముఖ్యమైన రోజుగా ప్రకటించారు. ఆరోజున రాష్ట్రంలోని ఇప్పటివరకు ఐ ఎఫ్ పి లు ఇవ్వని పాఠశాలలకు అన్నింటికీ అన్ని తరగతి గదులకు ఐఎఫ్పి లు ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు*.
అదేరోజు పాఠశాలలోని ప్రతి ఒక్క ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు టాబులను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ కంటెంట్ తో పాటుగా ఇవ్వటం జరుగుతుందని తెలిపారు*.
అందుకొరకు ప్రతి పాఠశాల నుండి ఖచ్చితమైన 8వ తరగతి నమోదు వివరాలను పంపాలని తెలిపారు*.
డౌట్ క్లియరెన్స్ యాప్ ని చక్కగా ఉపయోగించుకునేలా చూడాలని తెలిపారు*.
అంతేకాకుండా జనవరి ఆరవ తేదీ నుండి ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ అనే కార్యక్రమానికి కింద ఒక రిసోర్స్ పర్సన్ ని ప్రతి పాఠశాలకు పంపి IT కు సంబంధించిన ఐఎఫ్బి ట్యాబ్లు ఇంకా ఇతర ఐటి రిలేటెడ్ విషయాలలో ఉపాధ్యాయులకు సహాయకారిగా ఉండేలా పంపించుటకు ప్రయత్నం చేస్తున్నామని తెలుపుతున్నారు*.
అలాగే 10వ తరగతి విద్యార్థులను ఎంత సీరియస్ గా ప్రిపేర్ చేస్తామో అదేవిధంగా ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు కూడాను సంసిద్ధులను చేయాలని తెలిపారు. వారు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ... వారికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు*.
వారిని ఇంకొక స్థాయిలో వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దారని అందుకు ధన్యవాదాలు తెలియజేశారు*.
EPISODE-12 YOUTUBE LINK