thirumala-thirupathi-devasthanam-jobs-56-notification

thirumala-thirupathi-devasthanam-jobs-56-notification
TTD : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర వరకు జీతం.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే
TTD Tirumala Tirupati : తిరుమల తిరుపతి దేవస్థానం జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రధానాంశాలు:
  • టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • 56 ఏఈఈ, ఏఈ, ఏటీఓ పోస్టుల భర్తీ
  • నవంబర్‌ 23 దరఖాస్తులకు చివరితేది
  • TTD Tirumala Tirupati Devasthanam : తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇంజినీర్ల పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తగిన విద్యార్హతలతో పాటు ఆసక్తి వున్న అభ్యర్థులు నవంబర్ 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొన్ని వివరాలను పరిశీలిస్తే
  • మొత్తం ఉద్యోగాలు: 56
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్)- 27
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)- 10
  • అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)- 19
  • ముఖ్య సమాచారం :
  • అర్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయో పరిమితి: అప్లయ్‌ చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. 
  • TTD JOBS ONLINE REGISTRATION LINK
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • వేతన శ్రేణి: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760.. ఏఈకి రూ.48,440-1,37,220.. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.
  •  TTDER-Paper Notification
  •  TTDER-Web Notification
  •  TTDER-Syllabus for Posts - AEE,AE and ATO
  •  TTDER-User Manual
  • దరఖాస్తులకు చివరితేది: నవంబర్‌ 23, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: 
  • TTD JOBS ONLINE REGISTRATION LINK