APPSC Junior Lecturers Notification-2023-details
APPSC Junior Lecturers Notification: ఏపీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పోస్టులెన్నంటే?
It is hereby informed that the Commission has issued Notification No.16/2023, dated: 28/12/2023 for filling up of 47 carried forward vacancies through direct recruitment to the post of Junior Lecturers in Government Junior Colleges in A.P. Intermediate Education Service. The Notification is available on the Commission’s Website https://psc.ap.gov.in from 28/12/2023.
On-line applications are invited from the eligible candidates from 31/01/2024 to 20/02/2024 up to 11:59 mid night. The breakup of vacancies, scale of pay, age, community, educational qualifications and other information with instructions will be available on the Commission’s Website https://psc.ap.gov.in before 31/01/2024. The eligible candidates may apply online after satisfying themselves as per the terms and conditions of the notification by login the Commission’s website https://psc.ap.gov.in
APPSC: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల (జేఎల్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు.
APPSC JL Notification: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల (జేఎల్) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ లేదా ఆనర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు సంబంధిత వివరాలకు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను జనవరి 31లోపు అందుబాటులో ఉంచనున్నారు.
వివరాలు..
* జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 47
జోన్లవారీగా ఖాళీలు..
జోన్-1: 12, జోన్-2: 10, జోన్-3: 09, జోన్-4: 16.
సబ్జెక్టులవారీగా ఖాళీలు..
➥ ఇంగ్లిష్: 09 పోస్టులు
➥ తెలుగు: 02 పోస్టులు
➥ ఉర్దూ: 02 పోస్టులు
➥ సంస్కృతం: 02 పోస్టులు
➥ ఒరియా: 01 పోస్టు
➥ మ్యాథమెటిక్స్: 01 పోస్టు
➥ ఫిజిక్స్: 05 పోస్టులు
➥ కెమిస్ట్రీ: 03 పోస్టులు
➥ బోటనీ: 02 పోస్టులు
➥ జువాలజీ: 01 పోస్టు
➥ ఎకనామిక్స్: 12 పోస్టులు
➥ సివిక్స్: 02 పోస్టులు
➥ హిస్టరీ: 05 పోస్టులు
అర్హత: ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. సివిక్స్ సబ్జెక్టులు పొలిటికల్ సైన్స్ విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
Notification for the post of Junior Lecturers in Government Junior Colleges in A.P. Intermediate Education Service Notification (limited recruitment) No.16/2023, Dated: 28/12/2023 (Published on 28/12/2023) NOTIFICATION PDF CLICK HEREClick Here
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ(డిగ్రీ స్థాయి) - 150 ప్రశ్నలు- 150 మార్కులు- 150 నిమిషాలు; పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు (పీజీ స్థాయి) - 150 ప్రశ్నలు- 300 మార్కులు- 150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కుకాగా.. పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఇక ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.02.2024.
➥ రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024.
Notification for the post of Junior Lecturers in Government Junior Colleges in A.P. Intermediate Education Service Notification (limited recruitment) No.16/2023, Dated: 28/12/2023 (Published on 28/12/2023) - Click Here