APBRAGCET 2024 Dr. B.R. Ambedkar Gurukula Vidyalaya 5th Class Entrance
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) తాడేపల్లి, అమరావతి Dr.B.R. అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి నందు ప్రవేశము కొరకు ప్రకటన BRAG FIFTH CET – 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 సంవత్సరమునకు గాను ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాద్యమము) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు తేది: 25-01-2024 నుండి 23-02-2024 వరకు ఆన్ లైన్ లో సమర్పించాలి.
Eligibility Criteria ప్రవేశమునకు అర్హత :
Age Limit వయస్సు:
వయస్సు: ఎస్ సి (S.C) మరియు ఎస్ టి (S.T) విద్యార్థులు తేదీ 01.09.2011 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఓ సి (O.C), బి సి (B.C), ఎస్ సి కన్వెర్టడ్ క్రిస్టియన్స్ (BC-C) విద్యార్థుల తేదీ 01.09.2013 నుండి 31.08.2015 మధ్య జన్మించిన వారై ఉండాలి.
సంబంధిత జిల్లాలలో 2022-23 విద్యా సంవత్సరములో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరములో 4వ తరగతి నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువు పూర్తి చేసి ఉండాలి.
Income Limit ఆదాయ పరిమితి:
అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2022-24) రూ.1,00,000/-మించి ఉండరాదు.
Reservation Details రిజర్వేషన వివరాలు:
అన్ని గురుకుల విద్యాలయాల్లో S.C-75%, BC-C (converted christians) – 12%, S.T-6%, B.C-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి. • ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, ఆనాధలు, అత్యాచార బాధితులు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. అట్టి వారు సంబంధిత సర్టిఫికెట్ ను జతపరచవలెను
• వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి. ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీకాని యెడల, వాటిని s.. కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు. • ప్రతి కేటగిరి నందు 3% సీట్లను సఫాయి కర్మాచారి విద్యార్థులకు కేటాయించబడును. Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక-A నందు ఇవ్వబడినవి.
గమనిక: ఇతర సమాచారం కొరకు Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయముల ప్రధానాచార్యుల (Principals) వారిని సంప్రదించగలరు.
ఆసక్తి గల విద్యార్థులు apgpeet.apcfss.in ద్వారా ఆన్ లైన్లో మాత్రమే దరఖాస్తులు సమర్పించవలయును. తేదీ 25-02-2024 నుండి 24-03-2024 వరకు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడము జరుగుతుంది. తరువాత దరఖాస్తులు స్వీకరించడము జరగదు.
విద్యార్థులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని Dr.B.R అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా ధరఖాస్తులు సమర్పించవలయును
దరఖాస్తు చేయుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరములేదు.
• ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్థి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకున్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత, ఎటువంటి మార్పులకు అవకాశము ఉండదు.
2024-24 విద్యాసంవత్సరమునకు Dr.B.R.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశము కొరకు దరఖాస్తు చేసుకొన్న బాలురు మరియు బాలికలకు ప్రవేశ పరీక్ష తేదీ 24.04.2024 న 10.00 am to 12.00 noon నిర్వహించి అందులో వారు సాధించిన మార్కులు ఆధారంగా Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో సీట్లు కేటాయించడము జరుగుతుంది.
5వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ,12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా,కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా) 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎన్నుకోబడును.
DOWNLOAD HALLTICKETS CLICK HERE