appsc-released-notifications-for-33-jobs-in-various-departments

appsc-released-notifications-for-33-jobs-in-various-departments

APPSC: ఏపీలో ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు

వివిధ శాఖల్లో 33 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
 రాష్ట్రంలో వివిధ శాఖలలో ఉన్న 33 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏపీపీపీఎస్సీ శక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని గ్రేడ్ - 2 ఉన్న 18 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అసక్తి కలిగిన వారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 ఖాళీలకు గాను మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో లైబ్రెరియన్ 4 ఖాళీలకు గాను మార్చి 27 నుంచి ఏప్రిల్ 16వ తేదీ లోగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ 1 పోస్టుకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 16వ తేదీలోగా, విభిన్న ప్రతిభావంతుల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న 2 ఖాళీలకు మార్చి 1 నుంచి ఏప్రిల్ 21వ తేదీలోగా, భూగర్భ జలాలు సర్వీస్లో అసిస్టెంట్ కెమిస్ గా ఉన్న 1 పోస్టుకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 24వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిపికేషన్లో పేర్కొన్నారు .గ్రూప్ 2 సర్వీసెస్లో స్పోర్ట్స్ కోటాలో ఎంపికయిన అభ్యర్ధుల జాభితాను ఏపీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు.

 విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. విభాగాల వారీగా ఖాళీలివే


  • ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ 2024
  • 33 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు
  • APPSC Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) వరుసగా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 9న ఏపీపీఎస్సీ కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో.. కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 కింద -18.. టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ -07.. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ -04.. ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ -01.. వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌.. సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ -02.. భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ -01 చొప్పున మొత్తం 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
  • అలాగే.. కాలుష్య నియంత్రణ మండలి (పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు)లో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 పోస్టులకు మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. పూర్తి వివరాలు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌
    https://portal-psc.ap.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. అలాగే.. కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్‌ బలోపేతం కింద 19 పోస్టులు కేటాయిస్తూ శుక్రవారం (ఫిబ్రవరి 9) ఉత్తర్వులు జారీ చేసింది.
  • OFFICIAL WEBSITE LINK CLICK HERE
  • ATTENTION: Web Note for Various Notification Nos: 02/2024 to 07/2024 - (Published on 09/02/2024)   Click Here