SSC JE Notification 2024-jobs-notification
SSC JE Notification 2024: ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1,12,400 వరకు జీతం
ముఖ్య తేదీలు:- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2024
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2024
- దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 22 నుంచి 23 వరకు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I): జూన్ నుంచి 6 వరకు
SSC JE Recruitment 2024: ఉద్యోగార్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ చెబుతూ.. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. మొత్తం 968 జూనియర్ ఇంజినీర్ ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రిక్రూట్‌మెంట్ 2024- జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే) పోస్టులు: 438
- జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే) పోస్టులు: 37
- జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
- జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్ పోస్టులు: 12
- జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్ పోస్టులు: 120
- జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 121
- జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పోస్టులు: 217
- జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్) పోస్టులు : 02
- జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ పోస్టులు: 03
- జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోస్టులు: 03
- జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోస్టులు: 03
- జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
- జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ పోస్టులు: 02
- జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
- జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
- జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ పోస్టులు: 06
- ముఖ్య సమాచారం :
- అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అప్లయ్ చేసుకోవచ్చు.
- గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు.. ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి.
- జీత భత్యాలు: సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 వరకు ఉంటుంది.
- ఎంపిక విధానం: పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పరీక్ష విధానం: ఈ పరీక్ష రెండు అంచెల్లో పేపర్-1, పేపర్-2 గా ఉంటుంది. పేపర్-1, 2 ఆన్‌లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్-1లో మొత్తం 200 మార్కులకు.. 200 ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ ఇంజినీరింగ్ (100 ప్రశ్నలు- 100 మార్కులు)విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. జనరల్ ఇంజినీరింగ్ విభాగం (100 ప్రశ్నలు- 300 మార్కులు) నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 2 గంటలుగా నిర్ణయించారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
- దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- STAFF SELECTION COMMISSION OFFICIAL WEBSITE LINK CLICK HERE
- SSC JUNIOR ENGINEER JOBS ONLINE REGISTRATION LINK CLICK HERE