AP EAMCET Hall Ticket 2024

AP EAMCET Hall Ticket 2024 
AP ECET 2024 ఫలితాలు మరియు ర్యాంక్ కార్డ్స్ విడుదల.
AP ECET Result & Rank Cards 2024* available CLICK HERE
AP EAMCET Hall Ticket 2024 : ఏపీ ఎంసెట్‌ 2024 హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్‌.. ఈనెల 7న AP EAPCET Hall Ticket విడుదల!
AP EAPCET Hall Ticket 2024 : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET2024) హాల్‌టికెట్లు ఈనెల 7న విడుదలైనవి. 
APEAPCET-2024 HALLTICKET DIWNLIAD LINK CLICK HERE
గతంలో ఈ పరీక్షను EAMCET అని పిలిచేవారు. AP EAMCET 2024 ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే. ఈసారి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU-Kakinada) నిర్వహిస్తోంది. AP EAMCET 2024 పరీక్షలు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 18 నుంచి 23 వరకు.. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు 12 గంటల వరకు మొదటి షిఫ్ట్‌.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు AP EAPCET Hall Ticket 2024 విడుదలయ్యాక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
AP EAPCET 2024 ప్రవేశ పరీక్ష ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) వంటి వివిధ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాన్ని పొందవచ్చు. అలాగే.. ఫార్మసీలో డిప్లొమా కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), BVSc, AH, BFSc, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో 3 గంటల వ్యవధితో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
AP EAPCET-2024 ENTRANCE TEST ENGINEERING TEST  SYLLABUS CLICK HERE
AP EAPCET-2024 ENTRANCE TEST AGRICULTURE & PHARMACY TEST  SYLLABUS CLICK HERE
ఈ AP EAPCET 2024 పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి గణితం -80 మార్కులకు, భౌతిక శాస్త్రం-40 మార్కులకు, రసానయ శాస్త్రం-40 మార్కులకు ఉంటుంది. అలాగే.. బైపీసీ విద్యార్థులకు వృక్షశాస్త్రం- 40 మార్కులకు, జంతుశాస్త్రం- 40 మార్కులకు, భౌతిక శాస్త్రం- 40 మార్కులకు, రసాయన శాస్త్రం-40 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్/ఉర్దూ లేదా ఇంగ్లీష్/తెలుగులో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ ఉంటుంది. రాష్ట్రంలోని 47 ఆన్‌లైన్‌ సెంటర్లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఒక్కో ఆన్‌లైన్‌ సెంటర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2,35,417 మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445 మంది.. రెండు విభాగాలకు కలిపి 892 చొప్పున దరఖాస్తు చేసుకున్నారు.
AP EAPCET-2024 HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
AP EAPCET-2024 MOCK TEST LINK (FOR ENGINEERING) CLICK HERE
AP EAPCET-2024 MOCK TEST LINK (FOR AGRICULTURE & PHARMACY) CLICK HERE