AP EMRS Inter Admissions-2024
AP EMRS Inter Admissions : ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు-మే 3 నుంచి దరఖాస్తులు ప్రారంభం
ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పరిధిలోని 19 జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మే 3 నుంచి 18 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పరిధిలోని 19 జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మే 3 నుంచి 18 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.
ఏపీ ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు
ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల పరిధిలోని ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు (Intermediate Admissions 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఏడాది (2024) పదో తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
19 ఏకలవ్య కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని 19 ఏకలవ్య జూనియర్ కాలేజీల్లో(Ekalavya Junior Colleges) ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈపీ కోర్సు్ల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2024లో పదో తరగతి పాసైన గిరిజన, గిరిజనేతర విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు పూర్తి వివరాలను https://twreiscet.apcfss.in/ చూడవచ్చు. విద్యార్థులు ఇతర సందేహాల కోసం ఆయా జిల్లాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) కన్వినర్, ప్రిన్సిపాల్స్ ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ ఆధారంగా, ఈఎమ్ఆర్ఎస్ నిబంధనల మేరకు అడ్మిషన్ల భర్తీ చేపట్టాలని కాలేజీ ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.
మే చివరి వారంలో మెరిట్ లిస్ట్
ఏకలవ్య కాలేజీల్లో ఎటువంటి ప్రవేశ పరీక్ష(Entrance Exam) లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తారు. CBSE/SSC మార్కులు/ CGPA ఆధారంగా విద్యార్థులను ప్రవేశాలు కల్పిస్తారు. మే 3 నుంచి 18 వరకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లు(Applications) స్వీకరిస్తారు. మే నాల్గో వారంలో విద్యార్థుల మెరిట్ జాబితాను వెబ్ సైట్ లో ఉంచుతారు. జూన్ మొదటి వారంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలను https://twreiscet.apcfss.in/ లో చూడవచ్చు.
GKLMCET-2024 OFFICIAL WEBSITE LINK CLICK HERE
సీట్ల వివరాలు
- శ్రీకాకుళం-మెళియాపుట్టి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- ఏలూరు-బుట్టాయగూడెం-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- పార్వతీపురం మన్యం -జీఎల్ పురం- 90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- పార్వతీపురం మన్యం -కొటికపెంట(గురివినాయుడు పేట)-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- పార్వతీ పురం మన్యం -భామిని-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- పార్వతీపురం మన్యం -కురుపాం -90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- పార్వతీపురం మన్యం -అనసభద్రా-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా -చింతపల్లి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా- చింతూరు-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా -డుంబ్రిగుడ-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరు జిల్లా-ముంచింగ్ పుట్-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా-రాజవొమ్మంగి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా -జీకే వీధి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా -వై.రామవరం-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- అల్లూరి జిల్లా -మారేడుమిల్లి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- ప్రకాశం -దోర్నాల-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- నెల్లూరు -కొడవలూరు-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- తిరుపతి- ఓజిలి-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)
- తిరుపతి-బీఎన్.ఖండ్రిగ-90 సీట్లు(MPC -30, Bipc-30, HEP-30)