ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం మే 23 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపట్టనున్నారు. మే 31 నుంచి జూన్ 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకకు అవకాశం కల్పించారు. ఐచ్ఛికాలు మార్చుకునేందుకు మే 5వ తేదీలోనే వెసులుబాటు కల్పించారు. ఇక మే 7న సీట్ల కేటాయింపు ఉంటుంది. మే 10 నుంచి 14 వరకు విద్యార్ధులు సీట్లు పొందిన కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. విద్యార్థులు సీటు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా లేదంటే ఆన్‌లైన్ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
కాగా ఈ ఏడాది పాలిసెట్ ఫలితాలు మే 8వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించారు. వీరిలో బాలికలు 50,710 (89.81 శాతం) మంది, బాలురు 73,720 (73.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ ఏడాది పాలీసెట్ ఉత్తీర్ణత 87.61 శాతం నమోదైంది.
ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరి, ఇతర అంశాల ఆధారంగా కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీటు కేటాయిస్తారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.
మీ ర్యాంక్ ఆధారంగా మీరు సీటు పొందగల కళాశాలలను అంచనా వేయండి. గత సంవత్సరం కౌన్సెలింగ్‌లో చివరి ర్యాంకులు/కటాఫ్ ర్యాంక్‌ల ఆధారంగా కళాశాలలు ప్రదర్శించబడతాయి. మీ ర్యాంక్‌ను నమోదు చేయండి, అన్ని సంబంధిత వర్గాలను ఎంచుకుని, సమర్పించండి. కటాఫ్ ర్యాంకులతోపాటు కాలేజీల జాబితా ప్రదర్శించబడుతుంది.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ సమయంలో మీరు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు తదుపరి ఉపయోగం కోసం కాపీని సేవ్ చేయండి.
AP POLYCET Cut off Ranks – College Predictor (Based on 2023 Counselling Data)
CHECK AP POLYCET-2024 MOCK COUNSELLING/COLLEGE PREDICTOR CLICK HERE
Check AP POLYCET Mock Counselling/ College Predictor CLICK HERE