basara-iiit-rgukt-2024-admissions
Basara RGUKT 2024 Notification: బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈసారి ఎన్ని సీట్లు ఉన్నాయంటే!
తెలంగాణలోని బాసర రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక యూనివర్సిటీ (బాసర ఆర్‌జీయూకేటీ)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవుతాయి. జూన్ 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ వీసీ వి.వెంకటరమణ మే 27న వివరాలు వెల్లడించారు.
ఈసారి కూడా మొత్తం 1500 సీట్లను అందుబాటులో ఉంచినట్లు ఆయన చెప్పారు. వీటిల్లో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు పోటీపడవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లో సీట్లను భర్తీ చేస్తామని ఆయన అన్నారు.
ఫస్ట్ ఇయర్‌కు ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న వారు ఆ మొత్తం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 1000, కాషన్ డిపాజిట్ కింద రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700.. చొప్పున మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వీసీ వి వెంటక రమణ వివరించారు. ఈ ఏడాది తొలి ప్రయత్నంలో పదో తరగతి పాసైన వారు మాత్రమే ఇందులో ప్రవేశాలకు అర్హులు. అలాగే విద్యార్ధుల వయసు జూన్ 1 నాటికి 18 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు మాత్రం 21 యేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద భర్తీ చేస్తారు. ఇతర వివరాలను ఆర్‌జీయూకేటీ నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
బాసర ఆర్‌జీయూకేటీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే..
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 26, 2024వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సీట్ల కేటాయింపు తేదీ: జులై 3, 2024. ధ్రువపత్రాల పరిశీలన తేదీ: జులై 8 నుంచి 10 వరకు
BASARA IIIT RGUKT ADMISSIONS OFFICIAL WEBSITE LINK CLICK HERE