ec-instructions-on-the-counting-of-postal-ballot-votes

ec-instructions-on-the-counting-of-postal-ballot-votes

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కీలక సూచనలు చేసిన ఈసీ.. అవేమిటంటే?
Election Commission : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో గతంకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుకూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సుమారు 5లక్షల40వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇదిలాఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా పంపించారు.
ఎన్నికల సంఘం సూచనలు ఇవే..
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ (Form 13 A ) పై అటెస్టేషన్ & స్టాంప్  పొందుపరచటం   , పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు పై ECI వారి తాజా మార్గదర్శకాలు*
1) PB డిక్లరేషన్ (Form 13 A) పై అటెస్టింగ్ అధికారి యొక్క సీల్ (స్టాంప్) లేకపోయినప్పటికీ..... అటేస్టింగ్ అధికారి పేరు , వివరాలు పొందుపరచబడినట్లయితే అట్టి PB చెల్లుబాటవుతుంది.
2) Form 13 A పైన ఆ టెస్టింగ్ అధికారి సంతకం అసలైనదా /కాదా అని సరిచూచుటకు వారి యొక్క పేరు తదితర వివరాలతో కూడిన స్పెసిమన్ సంతకాలను జిల్లా ఎన్నికల అధికారి అన్ని జిల్లాలకు పంపుతారు.
3) PB వెనుక వైపు సంతకం / Facsimile పొందుపరచటం RO /ARO ల బాధ్యత. అటువంటి సందర్భాలలో  PB S No. మరియు కౌంటర్ ఫోయిల్ S No. రెండు సరి చూసి  సరైన PB అని నిర్ధారించవచ్చు. ఒకవేళ అట్లు సరిపోనియెడల అది చల్లని PB గా పరిగణించవచ్చు.
4) ఒకవేళ వెలుపలి కవర్ B (Form 13 C) పై ఓటర్ సంతకం లేనప్పటికీ......  డిక్లరేషన్ (13A) పై వాటర్ యొక్క ఐడెంటిటీ సరిచూసి  సదరు PB ని చెల్లుబాటు చేయవచ్చు...
*5) లోపలి కవర్ (Form 13 B) తెరవకుండానే  ఈ క్రింది సందర్భాలలో PB ని రిజెక్ట్ చేయవచ్చు....*
-- కవర్ B (Form 13 C) నందు డిక్లరేషన్ లేనప్పుడు
-- డిక్లరేషన్ పై ఓటర్ సంతకం లేదా అటెస్టింగ్ అధికారి సంతకం లేనప్పుడు
-- డిక్లరేషన్ (Form 13 A) లో పొందుపరిచిన పి.బి నెంబర్ మరియు లోపలి కవర్ A (Form 13 B) లో ఎండార్స్ చేయబడిన నెంబర్ వేర్వేరుగా ఉన్నప్పుడు..
5) లోపలి కవర్ B (Form 13 B) తెరిచిన పిదప కింది సందర్భాలు ఉత్పన్నమైతే PB ని రిజెక్ట్ చేయవచ్చు....
-- PB పై ఎట్టి ఓట్ చేయనప్పుడు
-- ఒకటికంటే ఎక్కువ అభ్యర్థులపై ఓట్ చేసినప్పుడు
-- PB నకిలీది అయినప్పుడు
-- PB చిరిగిపోయినప్పుడు
-- ఏ అభ్యర్థికి ఓటు చేశారో చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు
-- ఓటర్ ని గుర్తుపట్టేలా ఇతర రాతలు PB పై ఉన్నప్పుడు....

• గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
• ఫాం 13Aపై ఆర్వో సంతకం సహా పూర్తి వివరాలు నింపిఉంటే స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
• పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై ఆర్వో సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేదుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.
• పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం-సీ పై ఓటరు సంతకం లేదని బ్యాలెట్ ను తిరస్కరించ రాదని వెల్లడించింది.
• ఫాం 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా బ్యాలెట్ తిరస్కరించరాదు.
• పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా, ఆ ఓటు తిరస్కరణ కు గురి అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
AP ELECTION COMMISSION PROCEEDINGS FOR POSTAL BALLAT CLICK HERE