silver-jublee-college-cet-2024-details
Silver Jubilee CET 2024: సిల్వర్ సెట్ - 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Kurnool News: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రవేశ ప్రకటన వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
Kurnool News: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల ప్రవేశ ప్రకటన వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
Silver Jubilee Government College- Kurnool Admissions: కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'సిల్వర్ సెట్-2024' పరీక్షకు మే 4న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్షను జూన్ 16న నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 10 నుంచి అందుబాటులో ఉంచనునున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విద్యా బోధనతో పాటు భోజనం, వసతి అందిస్తారు. ఏపీలో పాత 13 జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌డెస్క్ 022-62507712 నంబరులో లేదా ఈమెయిల్: sjgdc2024@onlineregistrationform.org ద్వారా సంప్రదించవచ్చు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.