ttd-junior-colleges-admission-2024

tirumala-tirupati-devasthanams-ttd-junior-colleges-admission-2024
TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్యమైన తేదీలివే
ONLINE APPLICATIONS INVITED FOR ADMISSIONS IN TTD JUNIOR COLLEGES FROM MAY 15 _ టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి మే 15వ తేదీ నుండి ఆన్లైన్‌లో ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
TTD Junior Colleges Admissions 2024 : తిరుమల తిరుపతి దేవస్థానం- టీటీడీ నుంచి జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 31 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయించారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే ఉంటుంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్‌ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి :

  • విద్యార్థులు మొదట https://admission.tirumala.org/ వెబ్ సైట్ ఓపెన్‌ చేయాలి.
  • Student Manual in English or Student Manual in Telugu రెండు బాక్స్‌లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ పైన క్లిక్ చేయాలి.
  • అనంతరం దరఖాస్తు విధానాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. అనంతరం ఇంటర్మీడియేట్ కోర్సుకు జూనియర్‌ కాలేజీని ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు, తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టీటీడీ ఆధ్వర్యంలోని రెండు జూనియర్ కళాశాలల్లో ఉన్న గ్రూప్‌లు, అందుబాటులో ఉన్న సీట్లు, ప్రవేశానికి అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.
  • తిరుమల తిరుపతి దేవస్థానం , తిరుపతి ... ఇంటర్మీడియట్ నందు జాయిన్ అవడానికి ఎలా అప్లై చేయాలో తెలిపే PDF CLICK HERE
  • విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీటు తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థుల‌కు ఎస్ఎమ్ఎస్ పంపుతారు.
  • తరువాత సీటు పొందిన విద్యార్థి ధృవీకరణ పత్రాలను అధికారులు వారి సిస్టమ్ లోకి అప్ లోడ్ చేస్తారు. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగాలేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా (టాలీకాకున్న) సీటు రద్దు కావడంతోపాటు సిస్టమ్ నుండి ఆటోమేటిక్ గా సదరు దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేయాలి. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సందేహాలు, కోర్సులలోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.