10th-international-yoga-day-2024-instructions
గౌరవ PMSHRI HM లేదా ప్రిన్సిపాల్ లకు శుభోదయం. గౌరవ SPD గారు ఆదేశాలు మేరకు రేపు అనగా జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగ సందర్భంగా మన పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ రోజున సూర్య నమస్కారాలు లేదా యోగాసనాలు లేదా యోగాలో నిష్ణాతులైన వారిచే యోగా యొక్క ప్రాముఖ్యత సెమినార్లు నిర్వహించి వాటి యొక్క వీడియోస్, స్కిట్స్, photos గాని మీకు పంపించిన ట్రాకర్ నందు పంపవలెను. ప్రతి PD లేదా PET ఈ కార్యక్రమం చేయించవలెను. PMSHRI స్కూల్స్ నందు స్కూల్ PMSHRI బ్యానర్ ఖచ్చితంగా ఉండాలి.ఈ కార్యక్రమం ను విజయవంతం చేయాలనీ కోరుకుంటూ సమగ్రశిక్ష,
GOOGLE LINK CLICK HERE
International Yoga Day 2024: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు?
యోగాతో లభించే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను ప్రోత్సహించడానికి జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. జూన్ 21న శ్రీనగర్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. "యోగం" అనే పదం సంస్కృత మూలం "యుజ్" నుండి వచ్చింది, దీని అర్థం "చేరడం," "కలయిక", లేదా "ఏకం చేయడం". మనస్సు - శరీరం, లేదా ఆలోచనలు - చర్యలు లేదా సంయమనం- సంతృప్తి లేదా మానవులు - ప్రకృతి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు. శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతాయి.
INTERNATIONAL YOGA DAY Mass Surya Namaskar Demonstration (Virtual)
Special story on International Yoga Day & Importance and Benifits of yoga CLICK HERE
2024 సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ "యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ".
జూన్ 21 న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రాచీన భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.ఆరోగ్యపరంగా యోగా యొక్క విశిష్టతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను నొక్కి చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు.
ఆరోగ్య ప్రయోజనాలు
యోగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోజూవారీ పని ఒత్తిడి, ఆందోళన నిరాశకు మానసిక ఒత్తిళ్లకు మంచి ఔషధంగా యోగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు,దీర్ఘకాలిక నొప్పులనుంచి విముక్తి పొందేందుకు,యోగా ఒక చక్కటి సాధనంగా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ యోగ దినోత్సవ ప్రోటోకాల్ 21 ప్రార్థన
A. సూక్ష్మ వ్యాయమాలు (చాలన క్రియలు)
మెడ
భుజాలు
మోచేతులు
మణికట్టు
నడుము
మోకాళ్ళు
మడమలు సంబందించిన wormups చేయాలి.
B. ఆసనాలు
(నిలబడి)
తడాసన
వృక్షాసన
పాదహస్తాసన
అర్థచక్రాసన
త్రికోణాసన
కూర్చోని(sitting)
భద్రాసనం
వజ్రాసన
వీరాసన
అర్థఉష్ణ్రాసన
ఉష్ణ్రాసన
శశాంకాసన
ఉత్తానమండూకాసనం
వక్రాసన
బోర్లాపడుకొని(prone)
మకరాసనం
భుజంగాసనం
శలభాసనం
వెల్లకిలా(Supine)
సేతు బంధాసనం
ఉత్తన పాదాసనం
అర్థహలాసనం
పవనముక్తాసనం
శవాసనం
C . ప్రాణాయమాలు
కపాలభాతి
అనులోమా విలోమా
(నాడి శోధన)
శీతలీ
భ్రామరి
D.ధ్యానం
E.సంకల్పం
నేను నా మనసును ఎల్లపుడూ సంతులితంగా ఉంచుకుంటాను . ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది . నేను నా పట్ల , నా కుటంబం పట్ల , నా పని పట్ల , నా సమాజం పట్ల , ప్రపంచం పట్ల శాంతి , ఆనందము , ఆరోగ్య విషయములందు కర్తవ్యబద్దుడనై ఉంటాను .
International Day of Yoga 21.06.2024.pdf CLICK HERE