AP PGCET Hall Ticket Download 2024
AP PGCET Hall Ticket 2024 : ఏపీ పీజీసెట్ హాల్‌టికెట్లు విడుదల.. AP PGCET 2024 అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ లింక్ ఇదే
AP PGCET Hall Ticket Download 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (AP PGCET) హాల్‌టికెట్లను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసారి రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ AP PGCET 2024 ప్రవేశ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలు జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీల్లో జరుగనున్నాయి. AP PGCET Hall Ticket 2024 డౌన్‌లోడ్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
APPGCET-2024 HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
ఏపీ పీజీసెట్ 2024 ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీల్లో, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో ఉంటుంది. రాతపరీక్ష (ఎంపీఈడీ మినహా)లో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. పీజీసెట్ మూడు కేటగిరీల వారీగా నిర్వహిస్తున్నారు. కేటగిరీ-1లో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్; కేటగిరీ-2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్, కేటగిరీ-3లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి AP PGCET 2024 పరీక్ష నిర్వహిస్తారు.
AP PGCET 2024 పరీక్ష విధానం:
లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి.APPGCET-2024 EXAMS MOCK TEST CLICK HERE
APPGCET-2024 ALL SUBJECTS SYLLABUS CLICK HERE