IBPS RRB Recruitment-2024

 IBPS RRB Recruitment-2024
IBPS RRB Recruitment: గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాలు
తెలుగు రాష్ట్రాలకు ఎన్నిపోస్టులు కేటాయించారంటే?
IBPS RRB Application: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి 'ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ XIII' నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ (IBPS) జూన్ 6న విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 9,995 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 1149 పోస్టులు ఉన్నాయి. వీటిలో 570 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 525 ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు, 46 ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు, 8 ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏపీలో 452, తెలంగాణ 697 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
LAST DATE OF APPLICATION FOR RRB RECRUITMENT PRESS NOTE PDF CLICK HERE
పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్‌ 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XIII, 2024

ఖాళీల సంఖ్య: 9,995

1) ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5585 పోస్టులు

2) ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 3499 పోస్టులు

3) ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 782 పోస్టులు

విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-70, మార్కెటింగ్ ఆఫీసర్-11, ట్రైజరీ మేనేజర్-21, లా ఆఫీసర్-30, సీఏ-60, ఐటీ-94, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-496.

3) ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 129 పోస్టులు

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు...

➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 570 పోస్టులు

ఏపీ: 150 పోస్టులు (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు: 100, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు: 50)

తెలంగాణ: 420 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 285, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 135)

➥ ఆఫీసర్ స్కేల్-1: 525 పోస్టులు

ఏపీ: 300 పోస్టులు (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు: 250, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు: 50)

తెలంగాణ: 225 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 150, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 75)

➥ ఆఫీసర్ స్కేల్-2: 46 పోస్టులు

⫸ ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్): 40 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 40)

⫸ ఆఫీసర్ స్కేల్-2 (ఐటీ): 03 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 03)

⫸ ఆఫీసర్ స్కేల్-2 (సీఏ): 02 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 01, తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 01)

⫸ ఆఫీసర్ స్కేల్-2 (ట్రెజరీ): 01 పోస్టు (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్: 01)

⫸ ఆఫీసర్ స్కేల్-3: 08 పోస్టులు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్: 08)

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి (01.06.2024 నాటికి):

➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.06.1996 - 01.06.2006 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1994 - 31.05.2006 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1992 - 31.05.2003 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1984 - 31.05.2003 మధ్య జన్మించి ఉండాలి. 

➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.06.2024.

➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 07.06.2024 - 27.06.2024.

➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 22.07.2024 - 27.07.2024.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2024.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2024.

➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌/అక్టోబరు, 2024.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2024.

Notification

Officers (Scale-I, II & III) Online Application

Office Assistants (Multipurpose) Online Application

Website