ap-electricity-bills-payment-links
ఏపీ ప్రజలకు ముఖ్యగమనిక.. ఇక కరెంట్ బిల్లులు అలా చెల్లిస్తే కుదరదు
Pay Power Bill Pay Only Via App Website: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమైన గమనిక.. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడం ఇకపై కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. డిస్కంల వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. వినియోగదారులు డిస్కమ్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లులు చెల్లించాల్సిందే.
ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై విద్యుత్ బిల్లుల్ని ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి. జులై నెల నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను యాప్‌లు నిలిపివేశాయి. ఇకపై వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ డిస్కంలకు సంబంధించి యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు.
డిస్కంలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. జులై ఒకటో తేదీ నుంచి ఆయా చెల్లింపు సంస్థలు బిల్లుల చెల్లింపు సేవలు ఆపేశాయి. ఇకపై విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కంల వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను వినియోగించక తప్పదు. అయితే చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.. వినియోగదారులు డిస్కంల యాప్/వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అంతేకాదు కరెంట్ బిల్లుల్ని డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది అంటున్నారు.
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు (ఏపీసీపీడీసీఎల్) గూగుల్ ప్లే స్టోర్ నుంచి Central Power యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డిస్కం వెబ్సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని (ఏపీఈపీడీసీఎల్) విద్యుత్ వినియోగదారులు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి Eastern Power యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. డిస్కం వెబ్సైట్ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు, జిల్లాల పరిధిలో వినియోగదారులు (ఏపీఎస్‌పీడీసీఎల్) గూగుల్ ప్లే స్టోర్ నుంచి Southern Power యాప్/వెబ్సైట్ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలని సూచనలు చేశారు. ఈ మార్పును గమనించాలని కోరుతున్నారు అధికారులు.
విద్యుత్ బిల్లు చెల్లింపుల్లో సమర్థత, సెక్యూరిటీ పరంగా పెద్ద పీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరెంట్ బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని నిర్దేశించింది. అందుకే ఈ నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. అందుకే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదని చెబుతున్నారు. అందుకే ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు అంటున్నారు. అందుకే పేమెం్టస్ యాప్స్‌లో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు కుదరడం లేదట.
*🌷విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి🌷*
*🌴APCPDCL : ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి.*
*డిస్కం వెబ్సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి*
*🍁APEPDCL : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధి లోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.*
*డిస్కం వెబ్సైట్ apeastempower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.*
*⛱️APSPDCL : ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియో గదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్సైట్ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.*