scholarships-for-engineering-diploma-students

 scholarships-for-engineering-diploma-students
Scholarship: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏటా రూ.18 వేల స్కాలర్‌షిప్
Scholarship: ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలివే..?
విద్యార్థులకు భారీ శుభవార్త. ఇంజినీరింగ్, డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి శుభవార్త తెలిపింది
ఈ బ్రాంచీల్లో ఏ విద్యార్థులు అయితే చేరుతారో వారికి స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు ఏఐసీటీఈ సిద్ధమైంది. ప్రస్తుతం అంతా ఏఐ టెక్నాలజీ కావడంతో అందరూ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్స్ వైపే మొగ్గుచూపుతున్నారు.
దీంతో కోర్ ఇంజినీరింగ్ బ్రాంచిల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో వారిని ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ ఈ విద్యాసంవత్సరం నుంచి స్కాలర్‌షిప్స్ అందించనుంది.
ఇందుకోసం ఇంటర్‌, తత్సమాన పరీక్షలల్లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని ఏఐఈసీటీ నిర్ణయం తీసుకుంది.
కోర్ ఇంజినీరింగ్‌లో కూడా ప్రతిభావంతుల్ని చేర్చాలనే ఉద్దేశంతో ఏఐసీటీఈ ఈ కొత్త పథకానికి రూపకల్పన చేసింది.
యంగ్ ఎచీవర్స్‌ స్కార్‌షిప్ అండ్ హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ (యశస్వి) పేరిట.. ఏఐసీటీఈ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద ఎంపికైన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున ఏఐసీటీఈ ఇవ్వనుంది.
నేషనల్ ఇ-స్కాలర్‌షప్‌ పోర్టల్‌ (NSP)లో దీనికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో చేరినవారికి మాత్రమే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో తెలంగాణలో 71 మంది, ఏపీలో 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ రానుంది.
డిప్లొమాకు సంబంధించి తెలంగాణలో 52 మంది, ఏపీలో 115 మందికి స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నారు.
NATIONAL SCHOLARSHIPS PORTAL (NSP) WEBSITE LINK CLICK HERE