AP Model Foundation Schools

AP Model Foundation Schools ఏపిలో 41 ఫౌండేషన్ బడులు


ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీలను కలిపి ఎల్. కే. జీ, యూ. కే. జీ బోధన.

ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే ఏడాది 4 వేల బడుల్లో అమలు.


ఏపి రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక విద్యలో విద్యార్థులు తగ్గిపోతున్నందున ప్రవేశాలు పెంచడంపై దృష్టిసారించింది.


ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నిర్వహిస్తుండగా.. ప్రైవేటు బడులు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి నిర్వహిస్తున్నాయి. పసిప్రాయంలో అయా ప్రైవేటు బడులకు వెళ్లిన విద్యార్థులు అక్కడే ఉండిపోతున్నారు. కొన్నిచోట్ల ఐదో తరగతి వరకే ప్రైవేటు బడులు ఉండడం, ఆరో తరగతి తర్వాత ఫీజులు ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వస్తున్నారు. దీంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగున్నా..ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల ప్రవేశాలు దారుణంగా ఉంటున్నాయి.


ఇందులో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 41 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ఫౌండేషన్ బడులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాథమిక బడులకు ఇప్పటికే అంగన్వాడీలను అనుసంధానం చేశారు. ఎల్కేజీ, యూకేజీ ప్రారంభిస్తారు. ఈ బడుల్లోని టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.


ఎల్కేజీ వరకు అంగన్వాడీ టీచర్లు, యూకేజీ నుంచి ఐదో తరగతి వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లతో (ఎస్జీటీ) బోధన చేయిస్తారు. ఈ విధానం సత్ఫలితాలను ఇస్తే వచ్చే విద్యా సంవత్సరంలో 4వేలకుపైగా బడుల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది.


ఎంపిక విధానం:


రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున 26, జిల్లా విద్య, శిక్షణ సంస్థలకు (డైట్) సమీపంలో 13, శ్రీకాకుళం కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రాథమిక బడులను మోడల్ ఫౌండేషన్ బడుల కోసం గుర్తించారు. వీటిల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు.


నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఐపీ)ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఎన్ఐపీ అమలు చేస్తామ కేంద్రానికి అనుమతి లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. . ఎన్ఈపి అమలు చేస్తే ఒకటో తరగతిలో చేర్చుకునే విద్యార్థికి ఆరేళ్ల వయసు ఉండాల్సి ఉంటుంది. ఎల్కేజీలో మూడేళ్లు, యూకేజీలో నాలుగేళ్లుపైబడిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.


ఫౌండేషన్ బడులుగా ఎంపిక చేసిన అన్ని పాఠశాల్లో 1,906 మంది విద్యార్థులు ఉండగా.. 123 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో 41మందికి శిక్షణ ఇచ్చారు. వీరు 1,2 తరగతులకు బోధిస్తారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుడు సంఖ్య ఉండడంతో యూకేజీ బోధనకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ ఒకే ప్రాంగణంలో ఉన్న వాటినే కలిపి మోడల్ ఫౌండేషన్గా మార్చారు.